PRABANJANAM
Date of Publish : 02 September 2026, 11:51 am Posted by : Prabanjanam News

DJ BAN: వినాయక చవితికి కట్టుదిట్టమైన భద్రత.. ఈసారి కూడా డీజే నిషేధం..!

హైదరాబాద్ : వినాయక చవితి వేడుకల సందర్భంగా తెలంగాణ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల ప్రారంభం నుంచి నిమజ్జనం వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు.

ముఖ్యంగా నిమజ్జనం సందర్భంగా డీజేలకు అనుమతి ఇవ్వకుండా కఠినంగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవ కమిటీ సమావేశాల్లో పోలీసు ఉన్నతాధికారులు డీజే నిషేధంపై స్పష్టత ఇస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించేందుకు నిర్వాహకులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.