PRABANJANAM
Date of Publish : 01 September 2026, 3:26 pm Posted by : Prabanjanam News

ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌లపై అసెంబ్లీలో గళం వినిపించాలి: ఏబీవీపీ డిమాండ్

కూకట్‌పల్లి( ప్రభంజనం ): తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కూకట్‌పల్లి విభాగం, కూకట్‌పల్లి జిల్లా ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం భారీ విద్యార్థి ర్యాలీ నిర్వహించారు. కూకట్‌పల్లి బస్‌స్టాప్ నుంచి కూకట్‌పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో సుమారు 500 మంది విద్యార్థులు, ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ముఖ్యంగా విద్యార్థులకు అందాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌లను సకాలంలో విడుదల చేయడంతో పాటు, విద్యార్థుల సమస్యలపై అసెంబ్లీలో గళం వినిపించాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావును కోరారు. సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌ల విడుదలకు చర్యలు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు.

విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ లా ఫోరం కో కన్వీనర్ సునీల్ సావిస్కర్, కోక్ కన్వీనర్ గోపాల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాఘవేంద్ర నగర కార్యదర్శి రఘు, కేపీహెచ్ బీ నగర కార్యదర్శి కార్తీక్, ఆకాష్, ఉదయ్ కార్యకర్తలు పాల్గొన్నారు.