ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌లపై అసెంబ్లీలో గళం వినిపించాలి: ఏబీవీపీ డిమాండ్
కూకట్‌పల్లి( ప్రభంజనం ): తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కూకట్‌పల్లి విభాగం, కూకట్‌పల్లి జిల్లా ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం భారీ విద్యార్థి ర్యాలీ నిర్వహించారు. కూకట్‌పల్లి బస్‌స్టాప్ నుంచి కూకట్‌పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో సుమారు 500 మంది విద్యార్థులు, ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌ల...