- బీఆర్ ఎస్ నేత అశ్వంత్ కుమార్
కూకట్ పల్లి: ( ప్రభంజనం )
ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అంటూ నేడు ప్రజా వ్యతిరేక పాలన చేస్తుందని బీఆర్ఎస్ నేత అశ్వంత్ ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలకు లక్ష రూపాయలకు తోడు తులం బంగారం ఇస్తానన్న రేవంత్ రెడ్డి సర్కారు నేడు ఆ లక్ష రూపాయలకు కూడా దిక్కు లేకుండా చేసిందని, నిరుపేదల ఆడబిడ్డలకు ఉపయోగపడుతుందని ఆనాడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభిస్తే.. దానికి చట్టపద్ధత లేదు అంటూ దాన్ని కూడా ఆపడం ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అని అన్నారు. ఉన్న స్థలాలను అమ్మేస్తున్నారని, చిన్నపిల్లలకు ఉపయోగపడే పార్కు స్థలాలను కూడా అమ్మి వారి భవిష్యత్తును అంధకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాతిపెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. 420 అబద్దపు హామీలను చెప్పి అధికారంలోకి వచ్చి నేడు అన్ని రంగాలను బ్రష్టు పట్టించిన ఈ ప్రభుత్వానికి త్వరలోనే బుద్ధి చెబుతామని ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారని అన్నారు. ఈ ప్రజా వ్యతిరేక పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లి వారి వైఫల్యాన్ని ఎండగట్టే బాధ్యత తీసుకుంటామని అన్నారు.