Yadadri Bhuvanagiri: పాతగుండ్లపల్లిలో పకడ్బందీగా ఎస్‌ఐఆర్‌: మున్సిపల్ చైర్మన్ వాణి భరద్‌గౌడ్

యాదగిరిగుట్ట (ప్రభంజనం):పట్టణంలోని 7వ వార్డులో గురువారం ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్‌ సవరణ కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. వార్డు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, మ్యాపింగ్‌ ప్రక్రియలో పారదర్శకత ఉండేలా అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా మ్యాపింగ్‌లో నమోదు చేసిన వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఏమైనా తప్పులు లేదా అసంపూర్ణ సమాచారం ఉంటే వాటిని గుర్తించి, అక్కడికక్కడే అవసరమైన సవరణలు పూర్తి చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రికార్డులను సరిదిద్దడంలో సిబ్బంది నిమగ్నమయ్యారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వాణి భరద్‌గౌడ్, వార్డు...