యాదగిరిగుట్టలో సీఎం రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం

యాదగిరిగుట్ట (ప్రభంజనం): కాంగ్రెస్‌ నాయకులు బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై, నల్లగొండ బీజేపీ జిల్లా అధ్యక్షుడి నివాసంపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ యాదగిరిగుట్టలో బీజేపీ శ్రేణులు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. మంగళవారం స్థానిక బస్టాండ్‌ ప్రాంతంలో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడే బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ ఎన్నికల హామీలను అమలు చేయడంలో...