PRABANJANAM
Date of Publish : 21 August 2026, 2:03 pm Posted by : Prabanjanam News

వివేకా హత్య కేసు విచారణ ఈనెల 31కి వాయిదా

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై శుక్రవారం హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ విచారణకు నిందితుల్లో ఒకరైన వైకాపా ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి హాజరుకాలేదు. ఆయన నివాసం, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తుండటంతో ఆయన కోర్టుకు రాలేకపోయినట్లు సమాచారం.
మరోవైపు, ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్‌ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలు సైతం వ్యక్తిగత కారణాల వల్ల కోర్టు విచారణకు హాజరుకాలేదు. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డితో పాటు ఉమాశంకర్ రెడ్డి, వై.ఉదయ్‌కుమార్‌రెడ్డిలు సీబీఐ న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. ఉభయ పక్షాల వాదనలు, నిందితుల హాజరును పరిశీలించిన న్యాయస్థానం.. తదుపరి విచారణను ఈనెల 31వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.