వివేకా హత్య కేసు విచారణ ఈనెల 31కి వాయిదా
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై శుక్రవారం హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ విచారణకు నిందితుల్లో ఒకరైన వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి హాజరుకాలేదు. ఆయన నివాసం, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తుండటంతో ఆయన కోర్టుకు రాలేకపోయినట్లు సమాచారం. మరోవైపు, ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలు సైతం వ్యక్తిగత కారణాల వల్ల కోర్టు విచారణకు హాజరుకాలేదు. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర...