- ఎమ్మెల్యేలను కలిసి శుభాకాంక్షలు తెలిపిన బోర్డ్ మాజీ సభ్యులు
కంటోన్మెంట్,(ప్రభంజనం):
విజయదశమిని పురస్కరించుకుని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ లను కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, బోర్డ్ మాజీ సభ్యులు పాండు తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే అలయ్ బలయ్ ఆత్మీయతను పంచుకుంటూ, వారికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసి వారిని శాలువాతో సత్కరించారు. కలిసిన వారిలో బోర్డ్ మాజీ సభ్యులు లోక్ నాథం, నళిని కిరణ్, అనిత ప్రభాకర్, శ్యామ్ భాగ్యశ్రీతో పాటు తదితరులు పాల్గొన్నారు.


