Sunday, November 8, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomePoliticalకనీస వసతులకు నిధులు మంజూరు చేయాలి..

కనీస వసతులకు నిధులు మంజూరు చేయాలి..

📰 Generate e-Paper Clip

  • బీజేపీ సీనియర్ నేత తిరుపతి యాదవ్
  • సానుకూలంగా స్పందించిన మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్

బోయిన్‌పల్లి, (ప్రభంజనం):

ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్‌తో పాటు బోయిన్‌పల్లి ప్రాంతంలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించేందుకు తగిన నిధులు మంజూరు చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు తిరుపతి యాదవ్ కోరారు. ఈ మేరకు గురువారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డిని ఆయన ఛాంబర్‌లో కలిసి వినతిపత్రం సమర్పించారు.
పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ లేఖ ద్వారా ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్ పరిధిలోని పీవీ ఎన్‌క్లేవ్, గంగపుత్ర సంఘం కాలనీల్లో రెండు కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తిరుపతి యాదవ్ తెలిపారు. అదేవిధంగా బోయిన్‌పల్లి డివిజన్‌లోని స్మశానవాటికలను అభివృద్ధి చేసి, కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సరైన వసతులు లేక అధ్వాన స్థితిలో ఉన్న స్మశానవాటికల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోడ్ల నిర్మాణం, స్ట్రీట్‌లైట్ల ఏర్పాటు కోసం నిధులు మంజూరు చేయాలని కమిషనర్‌ను కోరారు.
ఈ సమస్యలపై కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి సానుకూలంగా స్పందించి, నిధుల కేటాయింపునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తిరుపతి యాదవ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు నల్లోళ్ల శేఖర్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.