Monday, November 9, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeCrimeసీజ్ చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టిన కానిస్టేబుల్..

సీజ్ చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టిన కానిస్టేబుల్..

📰 Generate e-Paper Clip

  • తండ్రి చికిత్స కోసమే ఆ పని చేశాడట..
  • రూ.12.37 లక్షలు స్వాహా

సిటీ క్రైమ్, ( ప్రభంజనం ):

తండ్రి ప్రాణాలు కాపాడుకోవాలనే తపన, ఆర్థిక అవసరాలు పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌ను తప్పుదారి పట్టించాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. విధి నిర్వహణలో భాగంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారం, మొబైల్ ఫోన్లను దుర్వినియోగం చేసిన మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శ్రవణ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మీరు పేట్ పోలీసు స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శ్రవణ్ కుమార్.. ఓ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్‌ను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ ఫోన్ ద్వారా సుమారు రూ.1.70 లక్షలను తన బంధువులకు చెందిన బ్యాంకు ఖాతాలకు ఆన్‌లైన్‌లో బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అదేవిధంగా పోలీసుల ఆధీనంలో ఉన్న 12 తులాల బంగారు ఆభరణాలను కూడా శ్రవణ్ అక్రమంగా బయటకు తీసుకెళ్లి తాకట్టు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. వాటి ద్వారా రూ.12.37 లక్షల నగదు పొందినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. సీజ్ చేసిన వస్తువుల దుర్వినియోగానికి సంబంధించి శ్రవణ్ కుమార్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. అయితే, తన తండ్రి ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, ఆయన చికిత్స కోసం భారీగా డబ్బు అవసరం కావడంతోనే ఈ అక్రమాలకు పాల్పడినట్లు శ్రవణ్ తెలిపినట్లు సమాచారం. ఇటీవలే ఆయన తండ్రి మరణించినట్లు తెలుస్తోంది. ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన పోలీసు సిబ్బందే దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకున్న వస్తువులను దుర్వినియోగం చేయడం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.