
హైదరాబాద్ : జేఎన్టీయూలో నేటి నుంచి తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో నవ ఇంజినీరింగ్ విద్యార్థులకు స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఘన స్వాగతం పలికింది. రాష్ట్రంలో ప్రఖ్యాతి గాంచిన సాంకేతిక విశ్వవిద్యాలయమైన జేఎన్టీయూలో ప్రవేశం పొందిన ప్రతి విద్యార్థికి అభినందనలు తెలిపింది.విశ్వవిద్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులు అపార అనుభవం, ఉన్నతమైన విషయ పరిజ్ఞానం కలిగిన వారని పేర్కొంది. వారి నుంచి సాంకేతిక నైపుణ్యాలు, విలువైన విజ్ఞానాన్ని నేర్చుకుని విద్యార్థులు తమ ప్రతిభను మెరుగుపర్చుకోవాలని సూచించింది.అలాగే సీనియర్ విద్యార్థులను ఇంట్లోని అన్నలు, అక్కల మాదిరిగా భావించి స్నేహపూర్వకంగా మెలగాలని, పరస్పర సహకారంతో తమ తమ రంగాల్లో నిష్ణాతులై జేఎన్టీయూ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేయాలని స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం కోరింది.


