Sunday, August 30, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaహైదరాబాద్JNTUHలో పార్ట్‌టైమ్‌ పీహెచ్‌డీ స్కాలర్‌పై విద్యార్థుల ఫిర్యాదు

JNTUHలో పార్ట్‌టైమ్‌ పీహెచ్‌డీ స్కాలర్‌పై విద్యార్థుల ఫిర్యాదు

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌: JNTUHలో పార్ట్‌టైమ్‌ పీహెచ్‌డీ స్కాలర్‌ రామకృష్ణ వ్యవహారశైలిపై ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులతో తరచూ ఘర్షణకు దిగుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తనకు ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయని, విద్యార్థుల డిగ్రీలు పూర్తి కాకుండా చూస్తానంటూ బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. రామకృష్ణపై వివిధ పోలీస్‌స్టేషన్లలో ఉన్న కేసులు, ఆయన పీహెచ్‌డీ ప్రవేశ అర్హత, క్యాంపస్‌లో తరచూ ఉండటంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. సోషల్‌ మీడియాలో విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వీడియోలు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపైనా విచారణ కోరారు. ఫిర్యాదు చేసిన విద్యార్థులకు రక్షణ కల్పించాలని, చర్యలు లేకుంటే మానవ హక్కుల కమిషన్‌, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయిస్తామని విద్యార్థులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.