Friday, August 28, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaరంగారెడ్డికొండాపూర్ ప్రభుత్య హాస్పిటల్ లో కనీస వసతులు కరువు

కొండాపూర్ ప్రభుత్య హాస్పిటల్ లో కనీస వసతులు కరువు

📰 Generate e-Paper Clip

  • కరెంట్ లేక రోగులకు తీవ్ర ఇబ్బందులు
  • త్రాగు నీటి సదుపాయం లేక రోగుల ఇబ్బందులు
  • లిఫ్ట్ సదుపాయం లేక బాలింతలు అవస్థలు
  • శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆరోపణలు
  • ఆస్పత్రిలో వసతుల పరిశీలన

శేరిలింగంపల్లి: ( ప్రభంజనం )

రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొండాపూర్ లోని జిల్లా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాల లేమిపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం బీఆర్ ఎస్ నాయకులు బొబ్బ నవతారెడ్డి, రవీందర్ యాదవ్, పొట్ట నరేందర్ యాదవ్ ఇతర నాయకులతో కలిసి ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులు ఎదుర్కొంటున్న కష్టాలపై వారు తీవ్రస్థాయిలో స్పందించారు.
కొండాపూర్ ఆసుపత్రికి నిత్యం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వందలాది మంది నిరుపేద, మధ్యతరగతి రోగులు వైద్యం కోసం వస్తుంటారని, కానీ ఇక్కడ ఏడు రోజులుగా కరెంట్ సౌకర్యం లేదని, టార్చ్ లైట్ వెలుతురులో ప్రసవాలు చేస్తున్నారు. కనీసం పేపర్లు లేక గర్భిణీల చేతుల మీద బీపీ,షుగర్ లు రాస్తున్నారని, లిఫ్ట్ సౌకర్యం లేక 3 అంతస్తులు ఎక్కి బాలింతలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. త్రాగు నీరు వసతులు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని, తక్షణమే ఆసుపత్రిలో మౌలిక వసతులను మెరుగుపరిచి, పేద ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలే: బొబ్బా నవతా రెడ్డి

బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి మాట్లాడుతూ.. ఆసుపత్రి నిర్వహణ, ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యేకు ఏడు రోజులుగా కరెంట్ లేదు అన్న విషయం తెలియదా అని అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే తక్షణమే స్పందించి, ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలన్నారు. నిరుపేదలకు కార్పొరేట్ స్థాయికి ధీటుగా వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. సమస్యలు పరిష్కరించక పోతే బీఆర్ఎస్ రోగుల పక్షాన నిలబడి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో మిద్దెల మల్లారెడ్డి, అల్లాఉద్దీన్ పటేల్, మమత, విజయ్ కుమార్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.