- గ్రామ సరిహద్దుల పరిశీలన
- గ్రామ కమిటీ, పెద్దమనుషుల భాగస్వామ్యంతో సర్వే
సిరికొండ: (ప్రభంజనం)
భూభారతి రీ సర్వేలో భాగంగా సిరికొండ మండలం పెద్దవాల్గొట్ గ్రామ శివారు సరిహద్దుల పరిశీలన చేపట్టారు. జిల్లా కలెక్టర్, సిరికొండ తహసీల్దార్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు, సర్వే బృందం గ్రామ శివారు ప్రాంతాలను పరిశీలిస్తూ సర్వే నిర్వహించారు. ఈ ప్రక్రియలో పెద్దవాల్గొట్ గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దమనుషులు, సర్పంచు, ఉప సర్పంచు, గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ) సభ్యులు చురుకుగా పాల్గొన్నారు. వీరితో పాటు పంచాయతీ కార్యదర్శి, గ్రామ సేవకులు, స్థానిక ప్రజలు పాల్గొని సర్వేకు సహకరించారు. గ్రామ శివారు భూముల సరిహద్దులను గుర్తించి, భూ వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించే ప్రక్రియలో గ్రామ కమిటీ, పెద్దమనుషుల భాగస్వామ్యం కీలకంగా నిలిచింది. పెద్దవాల్గొట్ క్లస్టర్ గ్రామ పాలనాధికారి నవీన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది.


