Sunday, November 8, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaహైదరాబాద్మల్లాపూర్ లో ఆర్ ఎస్ సోలార్ సిస్టమ్ నూతన కార్యాలయం

మల్లాపూర్ లో ఆర్ ఎస్ సోలార్ సిస్టమ్ నూతన కార్యాలయం

📰 Generate e-Paper Clip

  • ప్రారంభించిన మల్లాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తండా వాసుదేవ్ గౌడ్

మల్లాపూర్, ( ప్రభంజనం):

మేడ్చల్ జిల్లా, ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని మల్లాపూర్ డివిజన్ లో శుక్రవారం “ఆర్ ఎస్ సోలార్ సిస్టమ్” నూతన కార్యాలయం ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉమ్మడి మల్లాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తండా వాసుదేవ్ గౌడ్, తెలంగాణ రక్షణ సేన బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొరిగే నర్సింహా కురుమలు ముఖ్య అతిథులుగా హాజరై, రిబ్బన్ కట్ చేసి నూతన కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ… ప్రస్తుత కాలంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా సోలార్ (సౌర) ఇంధనం ఎంతో కీలకమైనదని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించడంలో సోలార్ సిస్టమ్స్ ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. మల్లాపూర్ ప్రాంత ప్రజలకు నాణ్యమైన సోలార్ ఉత్పత్తులు, త్వరితగతిన సేవలు అందించేందుకు ఈ సంస్థ ముందుకు రావడం అభినందనీయమని సంస్థ యజమాన్యులైన రవీందర్, సంతోష్ లను కొనియాడారు. “ఆర్ ఎస్ సోలార్ సిస్టమ్” నిర్వాహకులు వ్యాపార రంగంలో మరిన్ని విజయాలు సాధించి, వినియోగదారులకు నమ్మకమైన సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిలుగొండ వెంకటేష్ గౌడ్, మేడ బాపురాజు, రాజేందర్ రెడ్డి, మస్తాన్ భాస్కర్, కొండె వెంకటేష్, పోలు విక్రమ్ గౌడ్, శివ, కృష్ణ యాదవ్,సంస్థ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ నాయకులు పాల్గొని నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.