- పేదల ఇంట సంతోషాల వెలుగులు..
- ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం!
- ఫకీర్ టేక్య తండాలో ఇందిరమ్మ ఇళ్లకు ప్రారంభోత్సవం!
- లబ్ధిదారుల ఇళ్లను ప్రారంభించిన వేముల మహేష్ గౌడ్!
ఘట్కేసర్, (ప్రభంజనం):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల సొంతింటి కలను సాకారం చేస్తోందని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ అన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సర్కిల్, ఏదులాబాద్ 7వ డివిజన్, ఘనపురం గ్రామం పరిధిలోని ఫకీర్ టేక్య తండాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మాలోత్ సుగుణ, మూడావత్ యాకుబ్ నాయక్, వడ్త్యా రతన్ సింగ్ల ఆహ్వానం మేరకు వేముల మహేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులను అభినందించి, నూతన గృహాల్లో వారు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు సొంతింటి భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఘనపురం గ్రామ మాజీ సర్పంచులు నానావత్ రూప్ సింగ్ నాయక్, వేముల మమత గౌడ్, బద్దం గోపాల్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ వేముల సత్తయ్య గౌడ్, ఎదులాబాద్ 7వ డివిజన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వేముల శంకర్ గౌడ్, డివిజన్ కార్యదర్శి తాటికొండ మల్లేష్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు నానావత్ సురేష్ నాయక్, రామావత్ రాణితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.


