- ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రెస్ క్లబ్ సభ్యులు
సిరికొండ, (ప్రభంజనం):
సిరికొండ మండల ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఆంధ్రప్రభ రిపోర్టర్ పడిగెల రాజన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాజన్న మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన మండల జర్నలిస్టులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రధాన కార్యదర్శిగా నవతెలంగాణ రిపోర్టర్ రాజా గణేష్ గౌడ్, ఉపాధ్యక్షుడిగా జనంసాక్షి రిపోర్టర్ ప్రకాష్, కోశాధికారిగా ఆర్.సి. రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి పలువురు జర్నలిస్టులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సిరికొండ మండల రిపోర్టర్లు రాజేందర్, దీపక్, ధర్మపురి, ఆసిఫ్, రమేష్, తిరుపతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


