Tuesday, October 13, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaరంగారెడ్డినాగారంలో సెల్ టవర్ ఏర్పాటుపై స్థానికుల ఆందోళన

నాగారంలో సెల్ టవర్ ఏర్పాటుపై స్థానికుల ఆందోళన

📰 Generate e-Paper Clip

నాగారం బస్‌స్టాప్‌ వద్ద బైఠాయింపు

అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని స్థానికుల ఆగ్రహం

కీసర: ( ప్రభంజనం )

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నాగారం డివిజన్‌లో సెల్ టవర్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానికులు నాగారం బస్‌స్టాప్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. సెల్ టవర్ ఏర్పాటుతో తమకు, పరిసర ప్రాంత ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. నాగారం బస్‌స్టాప్ పక్కనే ప్రభుత్వ పాఠశాల ఉండటంతో విద్యార్థుల ఆరోగ్య భద్రతపై తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సెల్ టవర్ నుంచి వెలువడే రేడియేషన్‌పై ఆందోళన వ్యక్తం చేస్తూ, టవర్ ఏర్పాటును నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఘట్‌కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని సెల్ టవర్ ఏర్పాటుపై అధికారులు తక్షణమే విచారణ జరిపి, నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సెల్ టవర్‌ను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అక్కాల సురేశ్ కుమార్, నాగులు, అన్నంరాజు అర్జున్, సాయి, శరత్, సంపత్, వినోద్, మల్లేశ్, రాకేశ్, సాయికిరణ్, సాయిప్రసాద్, మామిళ్ల కృష్ణ, పోచయ్య, నాగేశ్ తో పాటు పలువురు కాలనీ వాసులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.