- సాంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్న విద్యార్థులు

దుబ్బాక,( ప్రభంజనం ): ఆషాడమాసం సందర్బంగా దుబ్బాక పట్టణంలోని మాస్టర్ మైండ్ పాఠశాలలో పోచమ్మ బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి, బోనాలతో, పోతరాజు వేశాధారణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, బోనాల వేడుకలు చూపరులను ఆకట్టుకున్నాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయలు ఎర్రోళ్ల హరిబాబు మాట్లాడుతూ.. విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో పాఠశాల డైరెక్టర్ వైవి రావు, బిట్ల యాదగిరి, దువ్వాల శ్రీకాంత్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు.


