Wednesday, September 9, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaరంగారెడ్డిహఫీజ్ పేట్ లో ఉద్రిక్తత..అక్రమ నిర్మాణాల కూల్చివేత

హఫీజ్ పేట్ లో ఉద్రిక్తత..అక్రమ నిర్మాణాల కూల్చివేత

📰 Generate e-Paper Clip

  • అక్రమ నిర్మాణాల కూల్చివేతపై బాధితుల ఆందోళన
  • భారీగా పోలీసుల మోహరింపు.

శేరిలింగంపల్లి (ప్రభంజనం):  మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని న్యూ హఫీజ్‌పేట్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్ అధికారులు చేపట్టిన కూల్చివేత చర్యలతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. తమ నిర్మాణాలను కూల్చివేయవద్దంటూ బాధితులు మున్సిపల్ అధికారులను వేడుకున్నారు. తమ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని కూల్చివేతలను నిలిపివేయాలని వారు కోరుతున్నారు. కూల్చివేతల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనతో సుభాష్ చంద్రబోస్ నగర్‌లో కొంతకాలం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీగా పోలీసులను మోహరించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.