Thursday, August 27, 2026
spot_imgspot_imgspot_imgspot_img
Homeభక్తివశిష్ఠుడు వెన్నతో కృష్ణుడిని చేసి ఆరాధించిన క్షేత్రం

వశిష్ఠుడు వెన్నతో కృష్ణుడిని చేసి ఆరాధించిన క్షేత్రం

📰 Generate e-Paper Clip

శ్రీకృష్ణుడిని ఎంతో మంది మహర్షులు ఆరాధించారు .. ఆ స్వామి సేవలో తరించారు. తన నామస్మరణలో .. తన కీర్తనల్లో తేలియాడే మహర్షులను స్వామి అనుగ్రహిస్తూ వచ్చాడు. అలా శ్రీకృష్ణుడు .. వశిష్ఠ మహర్షికి ప్రత్యక్షమైన క్షేత్రంగా ‘తిరుక్కణ్ణం గుడి’ కనిపిస్తుంది. ఈ క్షేత్రాన్నే ‘కృష్ణారణ్య క్షేత్రం’ అని కూడా పిలుస్తుంటారు.

తమిళనాడు .. నాగపట్నం సమీపంలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. 108 దివ్య తిరుపతులలో ఒకటిగా ఈ క్షేత్రం అలరారుతోంది. ఇక్కడ వశిష్ఠమహర్షి వెన్నతో శ్రీకృష్ణుడి ప్రతిమను చేసి ఆరాధించగా, ఆ స్వామి ప్రత్యక్షమయ్యాడట. వశిష్ట మహర్షిని ఆలింగనం చేసుకుని తన అనుగ్రహ వర్షాన్ని కురింపించాడు. ఇక్కడ రాత్రివేళ ఆకులు ముడుచుకునే ‘చింతచెట్టు’ .. పువ్వులు మాత్రమే తప్ప కాయలు కాయని ‘పొగడ చెట్టు’ కనిపిస్తాయి. తిరుమంగై ఆళ్వార్ కీర్తించిన ఈ క్షేత్రంలో  స్వామివారు ప్రత్యక్షంగా కొలువై వున్నాడనడానికి ఎన్నో నిదర్శనాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక భక్తుల అనుభవాలు ఇక్కడ  కథలు కథలుగా వినిపిస్తూ ఉంటాయి.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.