Monday, November 9, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeCrimeమాధవనగర్‌లో చోరీ..

మాధవనగర్‌లో చోరీ..

📰 Generate e-Paper Clip

  • ఇంటి తాళం పగలగొట్టి నగదు, బంగారం చోరీ

నిజామాబాద్ రూరల్, (ప్రభంజనం):

నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాధవనగర్‌లో ఇంటి తాళం పగలగొట్టి నగదు, బంగారు ఆభరణాలను గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. మాధవనగర్‌కు చెందిన నిర్మల (72) ఈ నెల 23న మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఇంటికి తాళం వేసి తన కుమార్తె అపర్ణతో కలిసి బంధువుల ఫంక్షన్‌కు వెళ్లారు. ఫంక్షన్ ముగించుకుని మధ్యాహ్నం 2.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చేసరికి తలుపు తాళం పగలగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లోని బెడ్‌రూమ్‌లో ఉన్న కబోర్డులో నగదు, బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఘటనాస్థలాన్ని పరిశీలించినట్లు రూరల్ ఎస్‌హెచ్‌ఓ శ్రీధర్ రెడ్డి తెలిపారు. చోరీకి పాల్పడిన గుర్తుతెలియని వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.