Monday, November 30, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeCrimeదళిత మహిళపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి

దళిత మహిళపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి

📰 Generate e-Paper Clip

బాధితురాలికి న్యాయం చేయాలి..

డీజేకేవీ రాష్ట్ర అధ్యక్షుడు బొజ్జ రమేష్ డిమాండ్

ఉప్పల్, (ప్రభంజనం):

విధి నిర్వహణలో ఉన్న దళిత మహిళ, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలు రమణపై దాడి చేసి, కులం పేరుతో దూషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలకృష్ణపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని దళిత జన కార్మిక విభాగం (డీజేకేవీ) రాష్ట్ర అధ్యక్షుడు బొజ్జ రమేష్ డిమాండ్ చేశారు. నల్లగొండ పట్టణంలోని 45వ వార్డులో జరిగిన ఘటనను ఆయన ఖండించారు. పారిశుద్ధ్య కార్మికురాలిపై దాడి చేయడం, కులం పేరుతో దూషించడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. బాధితురాలికి న్యాయం చేయడంతో పాటు పోలీసు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే దళిత, ప్రజా సంఘాలతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.