Friday, August 28, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaహైదరాబాద్యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

  • జాతీయ జెండా ఎగరవేసిన యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా
    ఎండీ కమలాకర్

శేరిలింగంపల్లి: ( ప్రభంజనం )

మియాపూర్ లోని యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా
ఎండీ కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ఉద్యోగులు, సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే మనం నేడు స్వేచ్ఛా వాతావరణంలో జీవిస్తున్నామని అన్నారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతోందని తెలిపారు. యువత నైపుణ్యాలను పెంపొందించుకుని దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని సూచించారు. యోషిత రియల్ ఎస్టేట్ సంస్థ కూడా నాణ్యత, నమ్మకం, పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తూ కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తూ సంస్థ అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తుందని కమలాకర్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.