Friday, August 28, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaవర్క్ పర్మిట్ల నిరాకరణ.. అంతర్జాతీయ విద్యార్థులకు కెనడా తీవ్ర హెచ్చరికలు!

వర్క్ పర్మిట్ల నిరాకరణ.. అంతర్జాతీయ విద్యార్థులకు కెనడా తీవ్ర హెచ్చరికలు!

📰 Generate e-Paper Clip

  • కెనడాలో పలువురు అంతర్జాతీయ విద్యార్థుల వర్క్ పర్మిట్లు తిరస్కరణ
  • నిబంధనలను ఉల్లంఘించి పని చేయడం చట్టాలను ఉల్లంఘించడమేనన్న కెనడా
  • అనుమతి లేని ఉద్యోగాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిక

కెనడాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులతో సహా పలువురు అంతర్జాతీయ విద్యార్థుల పోస్ట్-గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్లు (PGWP) తిరస్కరణకు గురికావడం, దానికి నిరసనగా విద్యార్థులు ఆందోళనలు చేపట్టడంపై ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (IRCC) స్పందించింది. విద్యార్థులు చదువుకునే సమయంలో పనిచేయడానికి వర్తించే నిబంధనలపై కీలక స్పష్టతనిస్తూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

స్టడీ పర్మిట్ నిబంధనలను అతిక్రమించి అనుమతి లేకుండా పనిచేయడం ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించడమేనని ఐఆర్‌సీసీ స్పష్టం చేసింది. పార్ట్-టైమ్‌గానైనా సరే అనుమతి లేని ఉద్యోగాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. నిబంధనలు పాటించని వారిపై భవిష్యత్తులో ఇచ్చే వర్క్ పర్మిట్లను రద్దు చేయడం, వీసాలు నిరాకరించడం లేదా దేశం నుంచి తిరిగి పంపించివేయడం వంటి కఠిన చర్యలు ఉంటాయని తెలిపింది.

కెనడాలోని పోర్టేజ్ కాలేజ్ విద్యార్థుల వర్క్ వీసాలు తిరస్కరణకు గురికావడంతో వారు ఆందోళనలు చేపట్టగా, ఈ అంశంపై న్యాయ సలహా తీసుకోవాలని సదరు కళాశాల యాజమాన్యం సూచించింది. రాబోయే రోజుల్లో విద్యార్థుల ప్రతినిధులతో భేటీ అయి పరిస్థితిని సమీక్షిస్తామని తెలిపింది. కెనడా ప్రభుత్వం విదేశీ విద్యార్థుల సంఖ్యపై, వర్క్ పర్మిట్లపై ఆంక్షలు కఠినతరం చేస్తుండటంతో వేలాది మంది భారతీయ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

అనధికారిక ఏజెంట్లు, జాబితాలో లేని కాలేజీల ద్వారా వర్క్ పర్మిట్ పొందాలని ప్రయత్నించవద్దని స్పష్టం చేసింది. తప్పుడు మార్గాలు అనుసరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుందని హెచ్చరించింది. అధికారికంగా గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లోనే చేరాలని, వర్క్ పర్మిట్ కోసం సరైన ప్రక్రియలు అనుసరించాలని సూచించింది. ఇటీవలి కాలంలో ఇలాంటి సంఘటనలు పెరగడంతో ఈ అడ్వైజరీ జారీ చేయాల్సి వచ్చింది. భారత విద్యార్థులు కెనడాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఎంతో మంది వెళ్తున్నారు. కానీ కొంతమంది అనధికారిక ఏజెంట్లు, ఫేక్ కాలేజీల ద్వారా వర్క్ పర్మిట్ పొందాలని ప్రయత్నించడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. కెనడా ప్రభుత్వం ఇప్పుడు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. కెనడాలో మన భారత విద్యార్థుల సంఖ్యే ఎక్కువగా ఉంది. దీంతో, కెనడా హెచ్చరిక మన విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపబోతోంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.