Saturday, August 29, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaరైతుబంధు మంచిదే.. కానీ కోటీశ్వరులకూ లబ్ధి: TG హైకోర్టు

రైతుబంధు మంచిదే.. కానీ కోటీశ్వరులకూ లబ్ధి: TG హైకోర్టు

📰 Generate e-Paper Clip

  • పథకాల పుణ్యాన పనులు చేయడం మానేశారు.
  • పల్లెటూర్లలో వ్యవసాయ కూలీలు దొరకట్లేదు
  • ఐఏఎస్‌ సందీప్‌ సుల్తానియా కేసు విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ : ఉచిత పథకాల ద్వారా ప్రభుత్వాలు భవిష్యత్ తరాలకు ఏం చెబుతున్నాయని తెలంగాణ హైకోర్టు తీవ్ర స్థాయిలో ప్రశ్నించింది. రైతుబంధు పథకం మంచిదే అయినప్పటికీ, ఎంతో మంది కోటీశ్వరులు కూడా దీని ద్వారా లబ్ధి పొందుతున్నారని న్యాయస్థానం అభిప్రాయపడింది. ప్రభుత్వ పథకాల కారణంగా ప్రజలు పనులు చేయడం మానేశారని, ప్రస్తుత పరిస్థితుల్లో పల్లెటూర్లలో కూలీలు కూడా దొరకని పరిస్థితి నెలకొందని కోర్టు వ్యాఖ్యానించింది. ఐఏఎస్‌ అధికారి సందీప్‌ సుల్తానియాకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా హైకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.ఈ సందర్భంగా రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఘోరంగా తయారైందని హైకోర్టు పేర్కొంది. ఉచితాల సంస్కృతి వల్ల  వస్తున్న మార్పులపై న్యాయస్థానం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. పథకాల ద్వారా ప్రజలను సోమరితనం వైపు నెట్టకుండా, ఉపాధి పనుల పట్ల ఆసక్తి పెంచేలా  చర్యలు ఉండాలని అభిప్రాయపడింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.