Saturday, August 29, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaమెదక్జర్నలిస్టుల ఐక్యతతోనే హక్కుల సాధన

జర్నలిస్టుల ఐక్యతతోనే హక్కుల సాధన

📰 Generate e-Paper Clip

  • జర్నలిస్టుల హక్కుల కోసం ఐక్య పోరాటం
  • టిడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీకి ఘన సన్మానం
  • పటాన్‌చెరు టిడబ్ల్యూజేఎఫ్ డివిజన్ ఉపాధ్యక్షులు నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో అభినందన సభ..

జిన్నారం: ( ప్రభంజనం )

జర్నలిస్టుల హక్కుల సాధన, సంక్షేమం కోసం ఐక్యంగా పోరాడాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) నాయకులు పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సంఘటిత ఉద్యమాలే బలమైన మార్గమని వారు పేర్కొన్నారు.
టిడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు డివిజన్ నూతన కమిటీ ఎన్నికైన సందర్భంగా బొల్లారంలోని కేఎస్‌ఎన్ బాంకెట్ హాల్‌లో డివిజన్ ఉపాధ్యక్షులు నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. నూతన అధ్యక్షుడు బాదిని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొత్తకొండ సత్యంతో పాటు కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు.

ఐక్యతతోనే హక్కుల సాధన

టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్గోయి ప్రభాకర్ మాట్లాడుతూ.. జర్నలిస్టులందరూ ఐక్యంగా ఉంటేనే తమ హక్కులను సాధించుకోగలరన్నారు. జర్నలిస్టుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు టిడబ్ల్యూజేఎఫ్ కృషి చేస్తుందని తెలిపారు. వృత్తి గౌరవాన్ని కాపాడుకుంటూ జర్నలిస్టుల సంక్షేమం కోసం సంఘం మరింత బలంగా పనిచేస్తుందన్నారు.
టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి సీలంకోటి సురేందర్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, గృహ స్థలాలు, పెన్షన్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. జర్నలిస్టుల హక్కుల సాధనలో ఐక్యతే ప్రధాన బలమని అన్నారు. టిడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ మెంబర్ ఏడుదొడ్ల సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జర్నలిస్టుల సంక్షేమ పథకాలను మరింత విస్తరించాలని కోరారు.
టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘు మాట్లాడుతూ.. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంఘటిత పోరాటం అవసరమన్నారు. డివిజన్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జర్నలిస్టుల సమస్యలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. నూతన కమిటీ జర్నలిస్టులందరినీ కలుపుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు. టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల కృష్ణ మాట్లాడుతూ, పటాన్‌చెరు డివిజన్ నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, వాటి పరిష్కారం కోసం నాయకత్వం చొరవ తీసుకోవాలని సూచించారు. ప్రతి జర్నలిస్టుకు సంఘం అండగా నిలవాలని, ఐక్యతను మరింత బలోపేతం చేయాలని అన్నారు.

జర్నలిస్టులకు అందుబాటులో ఉంటాం

నూతన అధ్యక్షుడు బాదిని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొత్తకొండ సత్యం మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన జర్నలిస్టులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్ పరిధిలోని ప్రతి జర్నలిస్టుకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా, రాష్ట్ర నాయకత్వంతో సమన్వయం చేసుకుంటూ జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం పనిచేస్తామని తెలిపారు. ఈ అభినందన సభతో పాటు జర్నలిస్టుల ఐక్యత, సంఘ బలోపేతం కోసం కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించిన డివిజన్ ఉపాధ్యక్షులు నర్సింహారెడ్డి, చంద్రశేఖర్, రామకృష్ణలను టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా, రాష్ట్ర కార్యవర్గ నాయకులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ డివిజన్ సలహాదారులు వాసుదేవ్,. నాయకులు, సీనియర్ జర్నలిస్టులు, వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.