- నివాళులర్పించిన గౌడ సంఘం నాయకులు
టేక్మాల్: ( ప్రభంజనం )
టేక్మాల్ మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను మంగళవారం మండల గౌడ సంఘం బాధ్యుడు సందీప్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టేక్మాల్ చౌరస్తాలో సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సందీప్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిమ్మ రమేశ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజేష్ గౌడ్, సర్పంచ్ లు సుధాకర్, సాయగౌడ్, సంగమేశ్వర గౌడ్, గౌడ సంఘం నాయకులు రాజయ్య గౌడ్, తుకారాం గౌడ్, లచ్చగౌడ్, దుర్గాగౌడ్, రాజాగౌడ్, రాజేష్ గౌడ్, సందీప్ గౌడ్, సదాశివ గౌడ్, రాజుగౌడ్, హన్మగౌడ్, సాయగౌడ్, నాగేష్ గౌడ్, సంతోష్ గౌడ్, అంజా గౌడ్, బాలరాజ్ గౌడ్, విట్టల్ గౌడ్, వీరగౌడ్, నరేష్ గౌడ్, ప్రేమ్ గౌడ్, పెంటగౌడ్, శ్రీనివాస్ గౌడ్, అంజ గౌడ్, నారాగౌడ్, గోపాల్ గౌడ్ రామాగౌడ్ , అంజి, రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


