Saturday, August 29, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaరంగారెడ్డిప్రజయ్ సిటీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ప్రజయ్ సిటీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

  • ముఖ్య అతిథిగా పాల్గొన్న యువ నాయకుడు ధాత్రీనాథ్ గౌడ్

శేరిలింగంపల్లి: ( ప్రభంజనం )

హఫీజ్‌పేట్ డివిజన్ యువ నాయకులు ధాత్రీనాథ్ గౌడ్ తన సతీమణి సింధుతో కలిసి ప్రజయ్ సిటీలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ ఎంజీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా ప్రజయ్ సిటీ పార్క్‌లో నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొని, పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, క్రీడాకారులు, యువత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.