- శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో అర్చకుల ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కర
- దేశ సమగ్రత, ఐక్యత కోసం ప్రత్యేక ప్రార్థనలు
కూకట్‌పల్లి,: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కూకట్‌పల్లి వివేకానంద నగర్‌లోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో స్వాతంత్ర్య వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేద మంత్రోచ్చారణల నడుమ జాతీయ పతాకావిష్కరణ ఆవిష్కరించారు.దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు అర్చకులు, భక్తులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాకు వందనం సమర్పించి, దేశ సమగ్రత, ఐక్యత మరియు శాంతి వర్ధిల్లాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భారతదేశం సర్వతోముఖాభివృద్ధి చెంది మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఆలయ ప్రాంగణమంతా త్రివర్ణ పతాకాలతో సుందరంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాలతో దైవ సన్నిధిలో దేశభక్తిని చాటిచెప్పారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు యోగేశ్వర శర్మ, నరేష్ శర్మ, రాజేష్ శర్మ, కేశవాచార్యులతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.


