Friday, August 28, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaBRS Porubata: కాంగ్రెస్‌ వెయ్యి రోజుల వైఫల్యాలపై బీఆర్‌ఎస్‌ పోరుబాట

BRS Porubata: కాంగ్రెస్‌ వెయ్యి రోజుల వైఫల్యాలపై బీఆర్‌ఎస్‌ పోరుబాట

📰 Generate e-Paper Clip

  • సెప్టెంబర్‌ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వినూత్న నిరసనలు
  • ‘బాకీ కార్డుల’ పంపిణీతో ప్రజల్లోకి గులాబీ శ్రేణులు
  • పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ టెలీకాన్ఫరెన్స్‌లో కార్యాచరణ వెల్లడి

హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. ఈ అసమర్థ పాలనను, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు సెప్టెంబర్‌ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. పార్టీ సీనియర్‌ నేతలు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఈ ప్రత్యేక పోరాట కార్యాచరణను ఆయన దిశానిర్దేశం చేశారు.

చార్జిషీట్‌తో ప్రారంభం.. ప్రత్యేక కార్యక్రమాలు

సెప్టెంబర్‌ 1న తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై అధికారికంగా చార్జిషీట్‌ విడుదల చేయనున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. అనంతరం సెప్టెంబర్‌ 2 నుంచి వరుసగా ఏడు రోజుల పాటు రోజువారీ కార్యక్రమాలను ప్రకటించారు.

సెప్టెంబర్‌ 2 (ఆరు గ్యారెంటీల వైఫల్యం): నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, భారీ ఫ్లెక్సీల ప్రదర్శన. ప్రజలకు ప్రభుత్వం బాకీ ఉన్న హామీలను వివరిస్తూ ఇంటింటికీ ‘బాకీ కార్డుల’ పంపిణీ.

సెప్టెంబర్‌ 3 (రైతాంగ పోరు): వ్యవసాయ విధ్వంసంపై రైతు సదస్సులు. సాగునీరు, విద్య్త్‌, యూరియా, పంటల బీమా సమస్యలపై చర్చ. హైదరాబాద్‌లో 22ఏ నిషేధిత జాబితా భూముల సమస్యలపై నిరసనలు.

సెప్టెంబర్‌ 4 (మహిళా నిరసనలు): మహిళలు, వికలాంగులతో ప్రత్యేక సదస్సులు. రూ.2,500 ఆర్థిక సాయం, కేసీఆర్‌ కిట్‌, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ అమలుపై నిలదీత. వినూత్నంగా ‘వంటావార్పు’ కార్యక్రమాలు.

సెప్టెంబర్‌ 5 (యువజన గళం): విద్యార్థులు, యువతతో భారీ ర్యాలీలు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, జాబ్‌ క్యాలెండర్‌, యూత్‌ డిక్లరేషన్‌పై పోరాటం. ఆదిలాబాద్‌, సింగరేణి ప్రాంతాల్లో ప్రత్యేక సదస్సులు.

సెప్టెంబర్‌ 6 (నగర, పల్లె సమస్యలు): హైదరాబాద్‌లో ఆటోలతో భారీ ర్యాలీ. తాగునీరు, వీధిదీపాలు, ట్రాఫిక్‌, శాంతిభద్రతలపై ప్రభుత్వాన్ని నిలదీయడం. గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలపై నిరసనలు.

సెప్టెంబర్‌ 7 (ప్రజావాణి ఫిర్యాదులు): జిల్లా, మండల ప్రజావాణి కేంద్రాల్లో కాంగ్రెస్‌ మోసంపై వినతిపత్రాలు, ఫిర్యాదుల అందజేత.

సెప్టెంబర్‌ 8 (సమీక్షా ప్రెస్‌మీట్లు): అన్ని జిల్లా కేంద్రాల్లో మీడియా సమావేశాలు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు.

సెప్టెంబర్‌ 10: ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నిరసనలకు బీఆర్‌ఎస్‌ పూర్తి సంఘీభావం.

ఈ కార్యక్రమాలను కేవలం మొక్కుబడిగా కాకుండా, ప్రతి నాయకుడు బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని కేటీఆర్‌ కోరారు. కాంగ్రెస్‌ మోసాలను ప్రతి ఇంటికీ చేరవేస్తూ ప్రజలను చైతన్యవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.