- నుజ్జునుజ్జు అయిన కారు
డిచ్పల్లి : (ప్రభంజనం)
డిచ్పల్లి మండల కేంద్రంలోని నాగ్‌పూర్ గేట్ సమీపంలో రోడ్డుపై ఎలాంటి సూచనలు లేకుండా నిలిపి ఉంచిన గుర్తుతెలియని లారీ/ట్యాంకర్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి నిర్మల్ వెళ్తున్న హ్యుందాయ్ వెన్యూ కారు గురువారం ఉదయం ప్రమాదానికి గురైంది. కారులోని పైడిపల్లి భోజన్న (49) అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ గంగాధర్, వెనుక సీటులో ఉన్న మనోజ్‌కు గాయాలు కావడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య సంగీత ఫిర్యాదుతో డిచ్పల్లి ఎస్సై హరీఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


