- బిగ్‌బాస్ విజేత కల్యాణ్ పడాల చేతుల మీదుగా ప్రారంభోత్సవం
- ప్రత్యేక అతిథులుగా టేస్టీ తేజ, రామకృష్ణ హాజరు
- బ్యూటీ, ఫ్యాషన్, బ్రైడల్ సేవలన్నీ ఒకేచోట
శేరిలింగంపల్లి: ( ప్రభంజనం )
మియాపూర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన క్లారా బ్రైడల్ స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. మియాపూర్ మెట్రో సమీపంలోని కల్వరీ టెంపుల్ లైన్‌లో ఏర్పాటు చేసిన ఈ స్టూడియోను బిగ్‌బాస్ విజేత కల్యాణ్ పడాల ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిగ్‌బాస్ ఫేమ్ టేస్టీ తేజ, అగ్నిపరీక్ష ఫేమ్ రామకృష్ణ ప్రత్యేక అతిథులుగా పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. అతిథుల రాకతో ప్రారంభోత్సవ ప్రాంగణంలో సందడి నెలకొంది. అభిమానులు, స్థానికులు, బ్యూటీ–ఫ్యాషన్ రంగానికి చెందిన పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. ఆధునిక యువతుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన బ్రైడల్, బ్యూటీ సేవలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. క్లారా బ్రైడల్ స్టూడియో ప్రజల ఆదరణతో విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. బ్రైడల్ మేకప్‌తోపాటు బ్యూటీ, ఫ్యాషన్‌కు సంబంధించిన విభిన్న సేవలను నిపుణుల ద్వారా ఒకేచోట అందించడమే తమ లక్ష్యమని స్టూడియో నిర్వాహకులు తెలిపారు. ప్రారంభోత్సవానికి హాజరై ఆశీర్వదించిన అతిథులు, శ్రేయోభిలాషులు, వినియోగదారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.


