Tuesday, October 13, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaరంగారెడ్డిమట్టి గణపతి ప్రతిమలను ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం

మట్టి గణపతి ప్రతిమలను ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం

📰 Generate e-Paper Clip

  • పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
  • మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి
  • నాగారం డివిజన్ రాంపల్లిలో స్వచ్ఛందంగా మట్టి గణపతి ప్రతిమల పంపిణీ

కీసర : ( ప్రభంజనం )

నాగారం డివిజన్ రాంపల్లిలో మాజీ కౌన్సిలర్ కౌకుట్ల అనంత్ రెడ్డి ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమలను స్వచ్ఛందంగా పంపిణీ చేశారు. వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని మట్టి విగ్రహాలను ప్రజలకు అందజేయడం అభినందనీయమని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. మట్టి గణపతి ప్రతిమలను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పర్యావరణహితమైన వినాయక చవితిని నిర్వహించడం ద్వారా భవిష్యత్ తరాలకు మంచి సందేశాన్ని అందించవచ్చన్నారు. రాంపల్లిలో ఆదర్శవంతంగా మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేసిన దాత కౌకుట్ల అనంత్ రెడ్డిని మల్లారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.