Tuesday, October 13, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaరంగారెడ్డిచెత్త కుప్పలతో మరో జవహర్‌నగర్‌ గామారుతున్న రాంపల్లి

చెత్త కుప్పలతో మరో జవహర్‌నగర్‌ గామారుతున్న రాంపల్లి

📰 Generate e-Paper Clip

  • నాగారం మాజీ చైర్మన్ చంద్రారెడ్డి, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం
  • మూడు నెలలుగా చెత్త తరలింపు నిలిపివేసిన రాంకీ సంస్థ
  • స్థానికంగానే డంపింగ్ చేస్తున్న ఆటో డ్రైవర్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
  • అధికారులు తక్షణమే స్పందించకపోతే భారీ ఎత్తున ధర్నాలు తప్పవని హెచ్చరిక

కీసర : ( ప్రభంజనం )

రాంపల్లి గ్రామం డంపింగ్ యార్డుగా మారుతోందని, చెత్త సమస్యతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాగారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ చంద్రారెడ్డి, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత మూడు నెలలుగా ఇక్కడి నుంచి చెత్తను తరలించాల్సిన రాంకీ సంస్థ లిఫ్టింగ్ ప్రక్రియను పూర్తిగా నిలిపివేయడంతో సమస్య జటిలంగా మారిందని వారు పేర్కొన్నారు. గ్రామంలో సేకరించిన వ్యర్థాలను ఆటో డ్రైవర్లు అక్కడే డంప్ చేసి వెళ్లిపోతుండటంతో పెద్ద ఎత్తున చెత్త కుప్పలు పేరుకుపోయాయని.. వర్షాలు, ఎండల కారణంగా చెత్త కుళ్లిపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని, దోమలు, ఈగలు పెరిగి రోగాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాంపల్లి మరో జవహర్‌నగర్ డంపింగ్ యార్డులా తయారవుతుందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ఈ సందర్భంగా చంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. సంబంధిత అధికారులు, ఎంఎంసీ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, మూడు నెలలుగా సమస్య కనిపిస్తున్నా రాంకీ సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? తక్షణమే పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తరలించి, అక్కడ బ్లీచింగ్ తదితర పారిశుధ్య చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించకపోతే, స్థానిక ప్రజలతో కలిసి ఎంఎంసీ కార్యాలయం, ఘట్కేసర్ ఎదుట, ప్రధాన రహదారులపై భారీ ఎత్తున ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.