Sunday, November 8, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomePoliticalహాబీబ్ నగర్ రోడ్డు సమస్యపై స్పందించిన వడ్డేపల్లి

హాబీబ్ నగర్ రోడ్డు సమస్యపై స్పందించిన వడ్డేపల్లి

📰 Generate e-Paper Clip

  • సొంత నిధులతో బాగుచేయించేందుకు ముందుకు
  • క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్య తెలుసుకున్న వడ్డేపల్లి రాజేశ్వరరావు
  • హర్షం వ్యక్తం చేసిన కాలనీవాసులు, వడ్డేపల్లికి కృతజ్ఞతలు

కూకట్ పల్లి, ( ప్రభంజనం )

కూకట్ పల్లిలోని హబీబ్ నగర్ లో రోడ్ల విషయంలో స్థానికంగా ఉండే కాలనీవాసులు అవస్థలు పడుతున్న ఉషయాన్ని తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు వెంటనే స్పందించారు. అంజయ్య నగర్, శక్తినగర్, హబీబ్ నగర్ ను కలుపుతూ రోడ్డు నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు కలనీవాసులు తమ పరిస్థితిని చెప్పుకున్న పట్టించుకోకపోవడంతో విసిగిపోయిన కాలనీవాసులు బీజేపీ నేత వడ్డేపల్లి రాజేశ్వరరావును కలిశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యను వడ్డేపల్లికి విన్నవించారు. దీంతో స్పందించిన ఆయన తన సొంత నిధులతో రోడ్లు ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా శనివారం ఆ కాలనీలలో క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుండా గాలికి వదిలేస్తుందని ఆయన ఆరోపించారు. ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు తాను ఎప్పుడు ముందుంటానని, అందులో భాగంగానే ఈ నూతన రోడ్డు నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.