Thursday, October 15, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeCrimeఘట్‌కేసర్ సీఐ బాలస్వామిపై సస్పెన్షన్ వేటు!

ఘట్‌కేసర్ సీఐ బాలస్వామిపై సస్పెన్షన్ వేటు!

📰 Generate e-Paper Clip

  • అవినీతి ఆరోపణలు.. ఫిర్యాదుల వెల్లువ
  • 12 మందికి పైగా బాధితులు.. ఉన్నతాధికారుల విచారణ..

ఘట్‌కేసర్, (ప్రభంజనం):

ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బాలస్వామిపై సస్పెన్షన్ వేటు పడింది. ఫిర్యాదుల పరిష్కారంలో అవకతవకలు, అవినీతి ఆరోపణలు, భూ వివాదాల్లో తలదూరుస్తున్నారన్నా విమర్శల నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌లో న్యాయం కోసం వచ్చే పిటిషనర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదుల్లో నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆయన వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సుమారు 12 మందికి పైగా పిటిషనర్లు ఏసీపీ నుంచి పోలీస్ కమిషనర్ వరకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదులపై స్పందించిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టి, ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సేకరించినట్లు సమాచారం. విచారణ నివేదికను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతికి సమర్పించడంతో, ఆమె ఇన్‌స్పెక్టర్ బాలస్వామిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ సస్పెన్షన్ వ్యవహారం ప్రస్తుతం పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.