Friday, August 28, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaరంగారెడ్డిబీఎస్ఎఫ్–హెచ్‌సీయూ నూతన కమిటీ ఎన్నిక

బీఎస్ఎఫ్–హెచ్‌సీయూ నూతన కమిటీ ఎన్నిక

📰 Generate e-Paper Clip

  • బీఎస్ఎఫ్ కన్వీనర్‌గా ముద్దం నవీన్
  • అధ్యక్షుడిగా గోవు మల్లేష్ ఎన్నిక

శేరిలింగంపల్లి(ప్రభంజనం): గచ్చిబౌలిలోని హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో బహుజన స్టూడెంట్స్ ఫ్రంట్ (బీఎస్ ఎఫ్ – హెచ్ సీయూ) నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీఎస్ఎఫ్ కన్వీనర్‌గా ముద్దం నవీన్, కో–కన్వీనర్‌గా జన్ను శ్యామ్, అధ్యక్షుడిగా గోవు మల్లేష్ ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్లుగా కరింక, సుష్మిత, జనరల్ సెక్రటరీలుగా రాగ మాధురి, స్నేహ, జాయింట్ సెక్రటరీలుగా చారకొండ స్వాతి, కురిమిల్ల యశ్వంత్, కల్చరల్ సెక్రటరీలుగా జి.కె. మోహన్, అఖిల, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మాదిరాజు నరేష్, కోశాధికారిగా మనీషా నియమితులయ్యారు.

ఈ సందర్భంగా బీఎస్ఎఫ్ కన్వీనర్ ముద్దం నవీన్ మాట్లాడుతూ.. బహుజన మహనీయుల ఆశయ సాధనే లక్ష్యంగా బీఎస్ఎఫ్ పనిచేస్తుందని అన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, కాన్షీరాం ఆలోచనలు, పోరాటాలు, త్యాగాలను నిరంతరం స్మరించుకుంటూ బహుజన విద్యార్థులను సంఘటితం చేయడంలో బీఎస్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా జోగు రమేష్, చిలుక హరీష్, అసుర పరశు, అంజి ఎర్రోళ్ల, జిల్లా దివాకర్, త్రివేణి, విమల నూతన కమిటీకి సూచనలు, అభినందనలు తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులను ఐక్యం చేస్తూ పనిచేస్తున్న సంఘంగా బీఎస్ఎఫ్ మరింత బలోపేతం కావాలని వారు ఆకాంక్షించారు. కాన్షీరాం బహుజన భావజాలాన్ని విద్యార్థుల్లోకి తీసుకెళ్లడంతో పాటు, బుద్ధుడు ఆకాంక్షించిన సమతా సమాజ నిర్మాణం కోసం నూతన నాయకత్వం పనిచేయాలని సూచించారు. నూతన కమిటీ విద్యార్థుల విద్యా, సామాజిక సమస్యలపై నిరంతరం పోరాడుతూ.. విశ్వవిద్యాలయంలో సమానత్వం, సామాజిక న్యాయం, విద్యా అవకాశాల కోసం కృషి చేస్తుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఎఫ్ నాయకులు, యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.