- భక్తులకు అన్నదానం
ఆదర్శ కాలనీలో ఏర్పాటు చేసిన బాల గణేష్ మండపం వద్ద వినాయక చవితి సందర్భంగా ప్రతిరోజూ యజ్ఞాలు, హోమాలు, ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మండపంలో నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ భక్తులకు ప్రసాదాలు అందిస్తున్నారు. మంగళవారం బాన్సువాడ యూనియన్ బ్యాంక్ మేనేజర్ రావల్ కమల్జిత్ అనాల్ బాల గణేష్ మండపాన్ని సందర్శించి, అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి ప్రసాదం స్వీకరించారు. అనంతరం శ్రీ బాల గణేశుడి తీర్థప్రసాదాలు తీసుకుని, భక్తి మార్గంలో నడవాలని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా మండపం పరిసరాలు భజనలు, గణేష్ నామస్మరణతో మార్మోగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై గణేశునికి ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో బాల గణేష్ మండపం సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.


