Tuesday, October 13, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaనిజామాబాద్మిట్టపల్లిలో డ్రైనేజీ, రోడ్ల సమస్యలు..

మిట్టపల్లిలో డ్రైనేజీ, రోడ్ల సమస్యలు..

📰 Generate e-Paper Clip

  • ఏఏపీ రూరల్ ఇంచార్జ్ షేక్ జుబేర్ అహ్మద్

డిచ్పల్లి : (ప్రభంజనం)

డిచ్పల్లి మండలం మిట్టపల్లి గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లు సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ షేక్ జుబేర్ అహ్మద్ అన్నారు. మురుగునీరు రోడ్లపై నిలిచిపోవడంతో దోమలు, దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పాఠశాలలకు వెళ్లే మార్గాలు బురదమయంగా మారడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి శాశ్వత డ్రైనేజీ, సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకపోతే గ్రామ ప్రజలతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.