Friday, August 28, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaహైదరాబాద్సర్ పై స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలి

సర్ పై స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలి

📰 Generate e-Paper Clip

  • పార్టీ నాయకులకు
    కుత్బుల్లాపూర్ కో ఆర్డినేటర్ దిశా నిర్దేశం
  • సర్ కార్యక్రమంలో చొరవ చూపిన నేతలకు కలిసి సన్మానం

మేడ్చల్ ప్రతినిధి: (ప్రభంజనం )

సర్ పై స్ఫూర్తితో వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ ఏపీ మిథున్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ సూచనల మేరకు గురువారం బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సర్ -2026 కార్యక్రమం నిర్వహించారు. నిజాంపేట్, బండారి లేఔట్ బాచుపల్లి డివిజన్లకు చెందిన కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలు, సీనియర్ నాయకులను వారి సేవలను గుర్తించి, ఇంఛార్జి కొలన్ హన్మంత్ రెడ్డితో కలిసి అభినందించి మెమెంటోలు అందించారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తలు, నాయకుల సమన్వయంతో ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును పరిరక్షించే దిశగా ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి, మాజీ కార్పొరేటర్ కొలన్ వీరేందర్ రెడ్డి, డీసీసీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.