Monday, November 30, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomePoliticalట్యాంక్‌బండ్‌కు కదిలిన మెదక్ కాంగ్రెస్ శ్రేణులు

ట్యాంక్‌బండ్‌కు కదిలిన మెదక్ కాంగ్రెస్ శ్రేణులు

📰 Generate e-Paper Clip

  • సంవిధాన్ రక్షా ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న నియోజకవర్గ నాయకులు

పాపన్నపేట, ( ప్రభంజనం ):

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద నిర్వహించిన సంవిధాన్ రక్షా ర్యాలీలో మెదక్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివెళ్లి పాల్గొన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆధ్వర్యంలో మెదక్ నియోజకవర్గంలోని వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారత రాజ్యాంగ ఆశయాలు, ప్రజాస్వామ్య విలువలు, పౌరుల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ ర్యాలీలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు పబ్బతి ప్రభాకర్ రెడ్డి, పాపన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగంపేట నరేందర్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు గోవింద్ నాయక్, నాయకులు దోసని సంగమేశ్వర, సుంకరి శివయ్య, కుర్తివాడ ప్రవీణ్ గౌడ్ అరికెల సర్పంచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.