Monday, November 30, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomePoliticalసమ్మిట్ల పేరిట ప్రజాధనం వృథా..

సమ్మిట్ల పేరిట ప్రజాధనం వృథా..

📰 Generate e-Paper Clip

  • రైతుల పట్ల నిర్లక్ష్యం తగదు!
  • అకాల వర్షాలతో తడిసిన ధాన్యానికి వెంటనే పరిహారం ఇవ్వాలి
  • మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్

మహబూబ్ నగర్ బ్యూరో, ( ప్రభంజనం ):

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వివేకం లేకుండా రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ, సమ్మిట్ల పేరిట వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అకాల వర్షాలతో రంగారెడ్డి, కామారెడ్డి తదితర జిల్లాల్లో ధాన్యం తడిసి, కొట్టుకుపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కొనుగోలు కేంద్రాలు తెరిచినా ఒక్క బస్తా కొనకపోవడం వల్లే ధాన్యం వర్షార్పణమైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 24.30 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నా, నేటికీ 24 పైసల పరిహారం కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు తరలిపోతున్నా, పెద్దమందడి మండలానికి కేఎల్ఐ నీళ్లు అందకపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రాజెక్టులు ఎండబెట్టి ఇసుక దందా చేస్తున్నారని విమర్శించారు. ఎండిన పంటలకు, తడిసిన ధాన్యానికి తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వాకిటి శ్రీధర్, నందిమల్ల అశోక్, విజయ్ కుమార్, మాణిక్యం, పరంజ్యోతి, రఘువర్ధన్ రెడ్డి, వేణుగోపాల్ నాయుడు, ధర్మా నాయక్, నరసింహ, సునీల్ వాల్మీకి, జోహెబ్ హుస్సేన్, రాము, జమీల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.