Friday, August 28, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaహైదరాబాద్ప్రమాదంలో అంగవైకల్యం పొందిన ఆర్టీసీ డ్రైవర్‌కు రూ.50 లక్షల బీమా

ప్రమాదంలో అంగవైకల్యం పొందిన ఆర్టీసీ డ్రైవర్‌కు రూ.50 లక్షల బీమా

📰 Generate e-Paper Clip

  • యూనియన్‌ బ్యాంక్‌ సహకారంతో కుటుంబానికి ఆర్థిక భరోసా

హైదరాబాద్‌: విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురై కాలు కోల్పోయిన టీజీఎస్‌ఆర్టీసీ డ్రైవర్‌ ఎం.డి. మదార్‌ కుటుంబానికి రూ.50 లక్షల బీమా సాయం అందింది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ‘సూపర్‌ సాలరీ సేవింగ్స్‌ అకౌంట్‌’ ఉచిత ప్రమాద బీమా పథకంలో భాగంగా ఈ మొత్తాన్ని అందించారు. సోమవారం హైదరాబాద్‌ బస్‌భవన్‌లో టీజీఎస్‌ఆర్టీసీ వీసీ, ఎండీ వై. నాగిరెడ్డి, యూబీఐ సీజీఎం ఎం. రవీంద్రబాబు బాధిత కుటుంబానికి చెక్కును అందజేశారు. కోరుట్ల డిపో డ్రైవర్‌ మదార్‌ 2025 అక్టోబరు 9న బస్సుతో హైదరాబాద్‌ వస్తుండగా కుకునూర్‌పల్లి వద్ద నిలిపి ఉంచిన లారీని ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటివరకు ఈ బీమా పథకం ద్వారా 27 మంది ఆర్టీసీ సిబ్బంది కుటుంబాలకు ప్రయోజనం చేకూరిందని ఎండీ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.