Tuesday, October 13, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaనల్గొండయాదగిరిగుట్టలో స్వాతి నక్షత్ర వేడుకలు.. గిరి ప్రదక్షిణ

యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్ర వేడుకలు.. గిరి ప్రదక్షిణ

📰 Generate e-Paper Clip

  • భారీగా తరలివచ్చిన భక్తజనం..

యాదగిరిగుట్ట: (ప్రభంజనం)

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకం వైభవంగా నిర్వహించారు. అనంతరం గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కొండకింద వైకుంఠ ద్వారం వద్ద ఆలయ ఈఓ భవాని శంకర్ తో కలిసి ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రత్యేక పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. వేలాది మంది భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం బీర్ల అయిలయ్య స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఈఓ భవాని శంకర్ స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, సిబ్బంది, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.