- బాలానగర్ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళులు
కూకట్ పల్లి: ( ప్రభంజనం )
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా
బహుజన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్
376వ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. బాలానగర్ గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పులి శివ కుమార్ గౌడ్, మాజీ అధ్యక్షుడు పులి శ్రీకాంత్ గౌడ్ అధ్వర్యంలో బాలానగర్ ప్రధాన రహదారి వద్ద ఉన్న పాపన్న గౌడ్ విగ్రహం వద్ద వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా స్థానిక మాజీ కార్పొరేటర్లు ఆవుల రవీందర్ రెడ్డి, పండాల సతీష్ గౌడ్, ఏ-బ్లాక్ అధ్యక్షుడు నాగిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్ప రెడ్డి, మాజీ కౌన్సిలర్ లక్ష్మయ్య హాజరై పాపన్న విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి బాలు బహుజన కళాబృందం ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్బంగా కార్యనిర్వాహకుడు పులి శివ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. అణగారిన వర్గాల మధ్య నుంచి ఎదిగి, వారినే తన పోరాట శక్తిగా మలుచుకుని తెలంగాణ నేలపై స్వీయ పాలనకు పునాది వేసిన అసాధారణ ప్రజా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. సుమారు మూడున్నర శతాబ్దాల క్రితమే సామాజిక అసమానతలు, దోపిడీ, ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడిన పాపన్న ఒక వ్యక్తి మాత్రమే కాదని.. ఒక చారిత్రక తిరుగుబాటు.. సామాన్యుడి నుంచి నాయకుడిగా, యోధుడిగా, పాలకుడిగా ఎదిగి తన కాలంలోని అధికార వ్యవస్థను సవాలు చేసిన ప్రజా వీరుడుగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మేడ్చల్-మల్కాజ్గిరి అధికార ప్రతినిధి మధు మోహన్, టీడీపీ కార్యదర్శి చిలకూరి హరిచంద్, ఐఎన్టీయూసీ నాయకుడు కూన రవీందర్ గౌడ్, బీజేపీ బాలానగర్ అధ్యక్షుడు డా. కిరణ్, న్యాయ నిపుణులు ఎల్. ఎస్. రావు, ఎంఐఎం నాయకుడు మహంకాళి శంకర్, కాంగ్రెస్ నాయకులు పులి శ్రీకాంత్ గౌడ్, సదా గౌడ్, దండు రవి గౌడ్, మహిళా నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.


