Friday, August 28, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeCrimeమియాపూర్‌లో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

మియాపూర్‌లో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

  • జాతీయ జెండాను ఆవిష్కరించిన పీఏసీ ఛైర్మెన్ గాంధీ

శేరిలింగంపల్లి (ప్రభంజనం): మియాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండావందనం సమర్పించారు. అనంతరం ప్రజలకు 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ కో-ఆపరేటివ్ చైర్మన్ రఘునాథ్ యాదవ్, తాజామాజీ కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, మహిళా సోదరీమణులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. స్వేచ్ఛా స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎందరో మహానీయుల త్యాగాల పునాదులపై భారతదేశం నిర్మితమైందన్నారు. అమరవీరుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని, వారి త్యాగాలను ప్రతి భారతీయుడు స్మరించుకోవాలని పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ప్రపంచంలోనే అతిపెద్ద, బలమైన ప్రజాస్వామ్య దేశంగా భారత్‌ ఎదుగుతోందని గాంధీ అన్నారు. దేశ కీర్తి ప్రతిష్టలను మరింత ముందుకు తీసుకెళ్లడం ప్రతి భారతీయుడి బాధ్యత అని, వీర జవాన్ల నిరంతర పోరాటం దేశ ప్రజలకు సురక్షితమైన జీవనాన్ని అందిస్తోందని, భారతీయత అనే ఐక్యతా బంధంతో అందరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.