- రామంతాపూర్ హోమియోపతి ఆసుపత్రిలో రోగులకు దుప్పట్లు, పండ్ల పంపిణీ
ఉప్పల్,(ప్రభంజనం) :
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా.. సమర్థవంత మైన పాలనా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా రామంతాపూర్ హోమియోపతి ఆసుపత్రిలో బీజేపీ మేడ్చల్–మల్కాజ్‌గిరి ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లపు జగన్ యాదవ్ ఆధ్వర్యంలో రోగులకు దుప్పట్లు, పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పాల్గొని ఆసుపత్రిలోని రోగులకు స్వయంగా దుప్పట్లు, పండ్లు పంపిణీ చేసి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ.. సమాజంలోని ప్రతి వర్గానికి అండగా నిలవడం, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం భారతీయ సంస్కృతిలోని సేవా స్ఫూర్తికి ప్రతీక అని అన్నారు. ప్రజాసేవ అంటే కేవలం రాజకీయ కార్యక్రమాలకే పరిమితం కాకుండా, బాధితులు నిరుపేదలకు అవసరమైన సమయంలో మానవతా దృక్పథంతో సహాయం చేయడమే నిజమైన సేవ అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవా ప్రస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకుని సేవా సంకల్ప్ అభియాన్ ద్వారా ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఆరోగ్యం, పరిశుభ్రత, సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్, డివిజన్ అధ్యక్షులు, బీజేపీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


