Tuesday, October 13, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaరంగారెడ్డిశ్రీనివాస నగర్ అభివృద్ధికి మరో ముందడుగు..

శ్రీనివాస నగర్ అభివృద్ధికి మరో ముందడుగు..

📰 Generate e-Paper Clip

  • రూ.20 లక్షలతో 160 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణం
  • మరిన్ని నిధులు తీసుకొచ్చి కాలనీ అభివృద్ధికి కృషి చేస్తా
  • రామిడి స్వప్న విజయ్ రెడ్డి

కీసర, సెప్టెంబర్ 22: ( ప్రభంజనం )

శ్రీనివాస నగర్ కాలనీ అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. కాలనీలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న 160 మీటర్ల పొడవైన సీసీ రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కీసర డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రామిడి స్వప్న విజయ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాలనీలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ సీసీ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడం పట్ల కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. రహదారి నిర్మాణం పూర్తయితే స్థానికులకు రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారడంతో పాటు వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు.
ఈ సందర్భంగా రామిడి స్వప్న విజయ్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీనివాస నగర్ కాలనీ అభివృద్ధికి అవసరమైన మరిన్ని నిధులను తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాలనీలోని మిగిలిన మౌలిక వసతుల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో ముందుకు సాగుతానన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. కాలనీ అభివృద్ధికి సహకరిస్తూ, సీసీ రోడ్డు నిర్మాణానికి కృషి చేసిన కీసర డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రామిడి స్వప్న విజయ్ రెడ్డి, కాంగ్రెస్ నేతలను శ్రీనివాస నగర్ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ పుండ్రు రాకేష్‌, కమిటీ సభ్యులు ప్రత్యేకంగా సన్మానించారు. కాలనీ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న కాలనీ అసోసియేషన్ సభ్యులను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చినింగని మల్లేష్, ఉపాధ్యక్షుడు మొరుగు నర్సింహ, సంయుక్త కార్యదర్శి శీలం మల్లేష్, సభ్యులు కర్రె గణేష్, అశోక్, హరి కృష్ణ, బెలిదే రాజు గుప్తా, వహీద్, జాఫర్, మొరుగు స్వామి, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.